26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజల ఆశీర్వాదంతోనే గెలుపు సాధిస్తాను

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ గుప్త

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పార్టీ రాజకీయాలకు అతీతంగా, ప్రజలే తన బలమని, ప్రజల ఆశీర్వాదంతోనే గెలుపు సాధిస్తానని స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ గుప్త నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీధర్ గుప్త తన ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా తన స్వంత డబ్బులతోనే 8 వ వార్డును అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఇంటికి మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, పారిశుధ్యం, రహదారులు, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలపై భారం వేయకుండా, పూర్తిగా తన స్వంత నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్మలక్కలు, మా అన్నా, మా అన్నను గెలిపించాలి అనే నినాదంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ప్రజలకు, ముఖ్యంగా 8వ వార్డు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని వార్డు ప్రజలకు, పట్టణ ప్రజలకు హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆడపిల్ల పెళ్లికి 11 వేల రూపాయలు ఇస్తానని, ఆడపిల్ల పుడితే 10 వేల రూపాయలు, అంత్యక్రియలకు పదివేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే నేను గెలిచిన 15 రోజుల్లో ఒక బాడీ ఫ్రీజర్ ఇప్పిస్తానని తెలిపారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని అన్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరి మద్దతుతో విజయం సాధిస్తామని అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

I will achieve victory with the blessings of the people.

More articles

Latest article