23.4 C
Hyderabad

నేను చట్టాన్ని గౌరవిస్తాను… ఆందోళన చెందాల్సిన పనిలేదు

Must read

📰 Generate e-Paper Clip

జైలు నుంచి విడుధలైన తరువాత అల్లు అర్జున్

 హైద్రాబాద్, బతుకమ్మ:

నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఆందోళన చెందాల్సిన పనిలేదు, నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు అని సినినటుడు అల్లు అర్జున్ అన్నారు. పుష్ఫ 2 బేనిపిట్ షో సందర్బంగా సంద్య థియేటర్ వద్ధ జరిగిన తోక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి కేసులో అర్జున్ శుక్రవారం అరెస్టు కాగా చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అదే రోజు హైకోర్టు బేయిల్ మంజురు చేసిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. ఈ సంధర్బంగా అల్లుఅర్జున్ తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతు… నేను బాగానే ఉన్నా,ఆందోళన చెందాల్సిన పనిలేదు అన్నారు. రేవతి కుటుంబానికి నా సానుభూతి, జరిగిన ఘటన దురదృష్టకరం ఇది అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు. ఈ  కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేను అన్నారు.

 

More articles

Latest article