29.7 C
Hyderabad

యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన యువకుడికి రెండున్నరేళ్ల కఠిన కారాగారం

Young man sentenced to two-and-a-half years of rigorous imprisonment for sexually harassing a young woman

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పదివేల రూపాయల జరిమానా

 

. . .  నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : 

 

ఇరవై ఏళ్ల యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఇరవై ఆరేళ్ళ పుల్కంటి రాజ్ కుమార్ కు రెండు సంవత్సరాల ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విదిస్తూ మహిళలపై జరిగిన అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మంగళవారం తీర్పు చెప్పారు. తీర్పులోని వివరాలు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ మద్వార్ నివాసుడైన అంబులెన్సు డ్రైవర్ పుల్కంటి రాజ్ కుమార్ నిజామాబాద్ నగరానికి చెందిన ఒక యువతి ప్రేమించుకున్నారు .ప్రేమవ్యవహారంలో అతని ప్రవర్తన నచ్చని ఆమె అతనితో వ్యక్తిగత సంబంధాలు తెంచుకున్నది. కొన్నాళ్లకు ఆమె తల్లిదండ్రులు వేరొక వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చి నిశ్చితార్థం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ 2026 పిబ్రవరి 2 న నిజామాబాద్ చేరుకుని యువతిని ఉద్దేశించి మనం కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు నా ఫోన్ లో ఉన్నాయి అవి నీకు నిశ్చితార్థం జరిగిన వారికి సోషల్ మీడియాలో పెట్టి బద్నామ్ చేస్తాను అని బెదిరింపులు చేశాడు.నన్ను ప్రేమించు, శరీరక వాంఛ తీర్చమని బలవంతం చేశాడు. అతను అనుకున్న విధంగానే ఆమెతో నిశ్చితార్థం జరిగిన వారికి సోషల్ మీడియాలో పంపించి ఆమె నిశ్చితార్థం చెడగొట్టాడు. సదరు నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ముద్దాయి రాజ్ కుమార్ కు రెండు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విదిస్తూ స్పెషల్ సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పిదప అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు.నిజామాబాద్ నగర ఐదవ టాన్ పోలీసుల తరపున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రజని ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

More articles

Latest article