29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : తాను పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదిని.. దోచుకునే వాడికే పదవులు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కావాలా.. మునుగోడు ప్రజలు కావాలా అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని అన్నారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారని తెలిపారు. పదవులు అడ్డుపెట్టుకుని సంపాదించేవాడిని కాదని, తన స్వార్థం కోసం మంత్రి పదవి అడగడం లేదని అన్నారు. ఎవరి కాళ్లో మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదన్నారు. దిగజారి బతకడం తనకు తెలియదని, మళ్లీ త్యాగానికైనా సిద్దమని తెలిపారు. ఎంత దూరమైనా మునుగోడు ప్రజల కోసం వెళ్లానని, తన నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయని అన్నారు.

More articles

Latest article