- పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
కామారెడ్డి, బతుకమ్మ : వికలాంగులకు, వితంతులకు పెంచి ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో మరో గర్జన సన్నాహక సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల పెన్షన్ 4 వేల నుంచి 6వేల రూపాయలు ఇస్తానని చెప్పి, ఇంతవరకు ఇవ్వడం లేదని అన్నారు. వృద్ధుల, వితంతుల చేయూత పెన్షన్ 2 వేల రూపాయలు పెన్షన్స్ ను 4 వేలు ఇస్తానని చెప్పి 20 నెలలు గడుస్తున్న ఇంతవరకు ఇవ్వడం లేదని మండి పడ్డారు. 20 నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్స్ పెంచడం లేదని, ఈనెల 13 తేదీన హైదరాబాద్లో జరిగే మహా గర్జనకు తరలిరావాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సన్నాక సదస్సు నిర్వహించుకోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరొక గర్జన సన్నాక సదస్సు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
