ఆర్మూర్, బతుకమ్మ : ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడు తాను కూర్చున్న సీట్ లో తన పాకెట్ పర్స్ పడిపోగా డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్ చూసి, ప్రయాణికునికి అప్పగించి తన నిజాయితీని చాటింది.వివరాల్లోకి వెళ్తే ఆర్మూర్ డిపోకు చెందిన మెట్ పల్లి టు నిజామాబాద్ ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు మంగళవారం ఆర్మూర్ నుండి నిజామాబాద్ వెళ్తున్న క్రమంలో కొండ అశోక్ గౌడ్ అనే ప్రయాణికుడు నిజామాబాద్ వెళ్లేందుకు ఎక్కడు. నిజామాబాద్ లోని గంగస్తాన్ రాగానే దిగిపోయాడు.ఆ ప్రయాణికుని పాకెట్ పర్సు అతను కూర్చున్న సీట్లో పడిపోయింది. బస్సు నిజామాబాద్ బస్సు స్టాండ్ కు వెళ్ళాకా ప్యాసింజర్లు అందురు దిగి వెళ్లిపోయారు. చివరగా డ్యూటీలో ఉన్న కండక్టర్ విద్యావతి సీట్లో పర్సు చూసింది. ఆపర్సు ఎవరిదని పర్సు తెరిచి చూడగా అందులో భాధితుని ఆధార్ కార్డు ఉంది. ఆ ఆధార్ కార్డు పై ఉన్న మొబైల్ నెంబర్ కు కాల్ చేసి డౌన్ లో మెట్ పల్లి వెళ్తుండగా గంగస్థాన్ స్టాప్ వద్ద బస్సు ఆపి పర్స్ పోగొట్టుకొన్న అశోక్ గౌడ్ కు అప్పగించింది. ఆ పర్సులో రూ. 1300 నగదు, ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు, ఏటీఎం కార్డు, హెల్త్ కార్డులు ఉన్నాయి.ప్యాసింజర్ పోగొట్టుకొన్న పర్సును నిజాయితీగా తిరిగి అప్పగించిన కండక్టర్ విద్యావతికి భాధితుడు అశోక్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
