30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్తకు పదేళ్ల జైలు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా సెషన్స్ జడ్జి భరత లక్ష్మీ తీర్పు

 

  • నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భార్య ఉరివేసుకుని చనిపోవడానికి కారకుడైన భర్తకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జివిఎన్ భరత లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి సర్కిల్ పోలీస్ అధికారి కోర్టులో సమర్పించిన అభియోగ పత్రం ఆధారంగా సెషన్స్ కోర్టు నేర న్యాయ విచారణ జరిపి, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి, ధ్రువీకరించుకున్న పత్రాలు మార్క్ చేసుకుని, వస్తుగత సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని డిచ్పల్లి మండలం ఘన్ పూర్ గ్రామ ఇస్లాంపుర కాలోని కి చెందిన షేక్ ఇద్రిస్ వివాహం నడిపల్లి గ్రామ నివాసురాలైన పౌజియా బేగం కు ఇస్లాం సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. పెళ్లిలో ఆమె తల్లితండ్రులు లక్ష నగదు కట్నం, పది తులాల బంగారం, బైక్ తో పాటు ఇంటి సమాన్లు సమర్పించారు.  పెళ్లి అయిన మూడు నెల్లలు మంచిగా ఉన్న అత్తింటివారు భర్త ఇద్రిస్, అత్త ఫాతిమ బేగం, బావ షేక్ అలీ అదనపు కట్నం లక్ష రూపాయలు తల్లిగారింటి నుండి తీసుకు రావాలని శరీరక, మానసిక హింసలకు గురి చేశారు. ఈ విషయంలో బంధువులు నచ్చజెప్పి సంసారం కుదుట పడేట్టు చేశారు. అయిన అత్తింటివారిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఎప్పటి మాదిరిగానే అదనపు కట్నం కోసం వేధింపులు షురూవైనాయి. పౌజియా తల్లిగారింటికి వచ్చి ఎలా అయిన అదనపు కట్నం ఇవ్వాలని మోరపెట్టుకుని తిరిగి ఘన్ పూర్ వచ్చింది. ఏళ్ళు గడుస్తున్న అదనపు నగదు కట్నం తీసుకు రాకపోవడం, పౌజియా కు పిల్లలు అయితలేరని మరోసాకు చూయించిన భర్త, అత్త, బావ ఎప్పటిలాగే హింసలకు గురి చేయడంతో ఆమె 15 అక్టోబర్, 2021 న అత్తగారింటిలోనే చున్నీతో ప్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయిందనే నేరారోపణలు భర్త షేక్ ఇద్రిస్ పై రుజువు కావడంతో, అతనికి ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 304(బి) వరకట్న మరణంకు గాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ సెషన్స్ జడ్జి భరత లక్ష్మీ తీర్పు వెలువరించారు. రెండవ ముద్దాయి అయిన అత్త ఫాతిమ బేగం కోర్టు విచారణ దశలో మరణించారు. మూడవ ముద్దాయి అయిన షేక్ అలీ పై నేరారోపణ రుజువు కానందున నిర్దోషిగా విడుదల చేశారు.

More articles

Latest article