భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్తకు పదేళ్ల జైలు
జిల్లా సెషన్స్ జడ్జి భరత లక్ష్మీ తీర్పు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భార్య ఉరివేసుకుని చనిపోవడానికి కారకుడైన భర్తకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జివిఎన్ భరత లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి సర్కిల్ పోలీస్ అధికారి కోర్టులో సమర్పించిన అభియోగ పత్రం ఆధారంగా సెషన్స్ కోర్టు నేర న్యాయ విచారణ జరిపి, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి, ధ్రువీకరించుకున్న పత్రాలు...