29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ : కరెంట్ మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో శుక్రవారం వ్యవసాయ కూలి మృతి చెందిన ఘటన ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలంలోని లింబాపూర్ గ్రామానికి చెందిన గౌలె యాదవ్ తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం వేంపల్లి గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చాడు. వేంపల్లి గ్రామానికి చెందిన జక్క గంగాధర్ వద్ద గత నెల రోజుల నుంచి వ్యవసాయ పనులకు వెళుతున్నాడు. రోజు మాదిరిగానే వ్యవసాయ పనులకు వెళ్లి మోటార్ కరెంట్ డబ్బాలో వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. దీంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసలు తెలిపారు.

More articles

Latest article