30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

భార్యను చంపి భర్త ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

జయశంకర్ భూపాలపల్లి, బతుకమ్మ :   జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాళ్లోకి  వెళ్తే.. .జిల్లాలోని గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో బాలరాజు రామాచారి (50), సంధ్య (42) దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది.  భార్య, కూతురు కలిసి బాలరాజును వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో వారి వేధింపులకు తాళలేక బాలరాజు  ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యను ఉరివేసి హత్య చేశాడు. అంతే కాకుండా హత్య చేసిన వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ తరువాత అతడు కూడా  ఉరివేసుకుని చనిపోయాడు. స్టేటస్ చూసిన బంధువులు, స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని  రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article