నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్తకు 13 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి తీర్పు చెప్పారు. మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన జల్లాపురం మౌనిక 2023 ఆగస్టు 28 తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ గ్రామానికి చెందిన మౌనికకు మంచిప్ప గ్రామానికి చెందిన జల్లాపురం సాయి కుమార్ తో 7 సంవత్సరాల క్రితం వారికి వివాహం జరిగింది. వారికి ఏడాది వయస్సు కలిగిన కుమారుడు కలరు. సాయి కుమార్ కు స్థానికంగా మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండి భార్యను వేధించే వాడు. ఇతరులతో ఫోన్ లో మాట్లాడే విషయంలో పలు మార్లు గొడవలు జరిగిన పంచాయతీ లు మార్పు రాకపోవడంతో మౌనిక తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మోపాల్ కేసులు నమోదు చేసి జల్లాపురం సాయి కుమార్ ను అరెస్ట్ చేసి అతని తల్లి నవనీత పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను, కేసు పూర్వపరాలు పరిశీలించిన జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారత లక్ష్మీ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో సాయి కుమార్ కు భార్య ఆత్మహత్యకు కారణమైనందుకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. భార్యను వేధించినందుకు మరో 3 సంవత్సరాల జైలు శిక్ష రూ.1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల మరో మూడు నెలలు అధనంగా జైలు శిక్ష అనుభవించాలని , ఈ కేసులో సాయి కుమార్ తల్లి నవనీత నిర్దోషిగా తీర్పు లో వెల్లడించారు.
