భార్య భర్తల బ్లాక్ మెయిల్ దందా

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   డబ్బు పై ఆశ పెంచుకున్న భార్య భర్తలు సులభంగా డబ్బు సంపాదించేందుకు విచిత్రమైన దందాకు పూనుకున్నారు. లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్న కేసు లో బుక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల వసూళ్లకు తెరలేపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని భార్యభర్తలకు కటకటాల వెనక్కి పంపారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మథ్కేడ్ తాలూకా ముక్రంబాద్ గ్రామానికి చెందిన మంగేష్కర్ గైక్వాడ్, ఉజ్వల...