23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు

Must read

📰 Generate e-Paper Clip

  • ఐదు నెలలుగా అందని జీతాలు

బతుకమ్మ, బిచ్కుంద :  చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న బిచ్కుంద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కు గత ఐదు నెలల నుంచి జీతాలు లేక అర్ధాకలితో వారి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.అటు ప్రభుత్వం కానీ ,అధికారులు కానీ పట్టించుకునే నాధుడే లేదు.గ్రామాలను పరిశుభ్రంగా ఉండడానికి గత ప్రభుత్వం పెద్ద గ్రామ పంచాయతీలకు ఐదుగురు, చిన్న గ్రామ పంచాయతీ లకు ఇద్దరు చొప్పున ఒకొక్కరికి 8 నుంచి 10 వేల జీతంతో (మల్టీపర్పస్ వర్కర్)పేరు తో పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. కానీ నెల నెల జీతాలు లేక కార్మికులు పనిచేస్తూ ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే వారు లేరు.

  • ఐదు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు..

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో ని బిచ్కుంద మండలం లో పదిమంది మల్టీపర్పస్ వర్కర్స్ ఉన్నారు. వారి జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల ఇచ్చే నిధుల నుండి,కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుండి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేవారు.గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాక గత రెండు సంవత్సరాల నుండి జనరల్ ఫండ్ జమ చేసి రెండు,మూడు నెలలకు ఒకసారి మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు ఇచ్చేవారు.కానీ గ్రామ సర్పంచ్ ల పదవులు గడువు ముగింపుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ లను నియమించింది. కానీ స్పెషల్ ఆఫీసర్ లు గ్రామాలను సందర్శించకపోవడం,కార్మికుల జీతాల గురించి,వారి సమస్యలను పట్టించుకోవడం లేదని కార్మికులు వ్యక్తం చేశారు.నెలనెలా జీతాలు రాకపోవడం తో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేకపోతున్నాం అని,గ్రామాల్లో దుకాణం కొట్టులో ఉద్దేరా నిత్యావసర సరుకుల ఇవ్వడంలేదని,అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు.

  • జీతాలు లేక మూలన పడ్డ చీపురు కట్టలు..

గత ఐదు నెలల నుంచి జీతాలు లేక పనిచేస్తున్న మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య కార్మికులు జీతాలు లేక పనులు మానేయడం జరిగింది. బిచ్కుంద మండలంలోని కొన్ని గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పని మానేయడంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నే ఉండిపోయింది అని పలువురు విమర్శలకు చేస్తున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి కార్మికుల జీతాలు చెల్లించి గ్రామాలను పరిశుభ్రత గా ఉండేటట్లు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

  • కార్మికులకు ప్రతి నెల జీతాలు ఇవ్వాలి..
  • గ్రామంలోని పలువురు వ్యక్తుల బహిరంగంగా వ్యాఖ్యలు.

గత రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు పరిశుభ్రత గా ఉండాలని మల్టీపర్పస్ వర్కర్స్ లను నియమించింది.వారికి జీతాలు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ నిధుల ద్వారా జీతాలు చెల్లించే వారని ,గత రెండు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీకి స్టేట్ ఫైనాన్స్ నిధులు రావడంలేదు. కానీ కార్మికుల కు మాత్రం జీతాలు జనరల్ పాండ్ నిధులు జమచేసి వారికి జీతాలు ఇచ్చేవారని తెలిపారు. సర్పంచ్ ల పదవులు మూయగానే రాష్ట్ర ప్రభుత్వం వారి స్థానంలో స్పెషల్ ఆఫీసర్ లను నియమించి ఐదు నెలల గడుస్తున్నా గ్రామాలు అభివృద్ధి పనులలో ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉంది అని విమర్శలు చేశారు. ఇకనైనా మండల అధికారులు స్పందించి పారిశుద్ధ్య కార్మికుల కు నెల నెల జీతాలు ఇవ్వాలని కోరారు.

More articles

Latest article