28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భారీ ఊరట

Must read

📰 Generate e-Paper Clip

. చేవెళ్ల, మోకిల పీఎస్ లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు

. రాజకీయ కక్ష సాధింపులకు భయపడేది లేదన్న జీవన్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ: సుప్రీం కోర్టులో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. శంకర్ పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయనకు సుప్రీం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీచేసింది. అయితే దర్యాప్తునకు సహకరించాలని జీవన్ రెడ్డిని ఆదేశించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నమోదైన కేసు అని జీవన్ రెడ్డి తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, ఎస్ నిరంజన్ రెడ్డి, మహపూజ్ నజకీ ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ కేసుల్లోనే జీవన్ రెడ్డి భార్య, తల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తనను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిస్తున్న అక్రమ కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తానని అన్నారు. ఇప్పటివరకు తనపై 40 వరకు అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తు న్నారని వేదన వ్యక్తం చేశారు.  70 ఏళ్ల వృద్ధురాలైన తన తల్లి ఏం తప్పు చేశారని ఆమెను మానసికంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని, బెదిరింపులకు లొంగేదిలేదన్నారు. న్యాయస్థానాలపై తనకు  అచంచల మైన విశ్వాసం ఉందన్నారు.

More articles

Latest article