26.4 C
Hyderabad

రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Huge rally under the auspices of the Ration Dealer Welfare Association

Must read

📰 Generate e-Paper Clip

 

. .  . కలెక్టరేట్ ఎదుట నిరసన

 

. . . రేషన్ డీలర్లకు 5 వేల  గౌరవేతనం అమలు చేయాలని డిమాండ్

 

నిజామాబాద్ అర్బన్,బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లకు 5 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీని వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ లో గల మేరు సంఘం నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకురేషన్ డీలర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా  జిల్లా కలెక్టర కు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లకు ఆదుకుంటామని ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్న రేషన్ డీలర్ల యొక్క హామీలు నెరవేయడం లేదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేషన్ డీలర్లకు గౌరవ వేతనం 5 వేల రూపాయలు అమలు చేయాలని అదేవిధంగా క్వింటాల్ కు కనీసం 300 రూపాయల వరకు కమిషన్ ను పెంచాలని అదేవిధంగా దిగుమతి హామాలి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు జిల్లా అధ్యక్షులు నగేష్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి జిల్లా రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article