. . . కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మంచివార్ యోగేష్
బిచ్కుంద, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ విధివిధానాలకు విరుద్ధంగా తనను జిల్లా ఉప అధ్యక్ష పదవి నుంచి ఎలా తొలగిస్తారని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంచివార్ యోగేష్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆయన గణం తనపై దుష్ప్రచారం చేస్తూ తనను ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించమంటూ ప్రెస్ మీట్ లు పెట్టడంపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో తనపై కావాలని కొందరు కాంగ్రెస్ యూత్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి నలుగురు నాయకులను వెంటేసుకొని తనపై దుష్ప్రచారానికి తెర లేపారని ఇది సరైన విధానం కాదని విమర్శించారు. తనను సస్పెండ్ చేసినట్లు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గానికి ఫిర్యాదు చేశానని త్వరలో వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆశిస్తున్నానని ఆయన తెలియజేశారు. ఫిర్యాదు పై స్పందించిన రాష్ట్ర అధ్యక్షులు సదరు అంశంపై వివరణకు సైతం ఆదేశించారని పార్టీ నియమాలను అతిక్రమిం చిన వారెవరిని వదిలే ప్రసక్తి లేదని తన ఇమేజ్ ను ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసి తన ఇమేజ్ ను డామేజ్ చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు అయ్యేవరకు ఎవర్ని వదలబోనని స్పష్టం చేశారు. ఏది ఏమైనా పార్టీ నియమాలు కట్టుబడి గత ఎనిమిదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నానని తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాన్ని ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు.
