27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మనస్థాపంతో గృహిణి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : అబార్షన్ అయిందనే మనోవేదనతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన  పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై సునీల్ తెలిపిన కథనం ప్రకారం..  పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన మచ్కరి సుధాకర్ అనే వ్యక్తికి నాలుగు సంవత్సరాల క్రితం ముఖేడ్ తాలూకా ఓరల్ గ్రామానికి చెందిన మహాదేవితో వివాహం కాగా చాలా రోజుల తర్వాత మహాదేవి గర్భం దాల్చగా నాలుగు నెలల గర్భస్థ శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో  అబార్షన్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అబార్షన్ అయిందనే మనోవేదనతో  సదరు గృహిణి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

More articles

Latest article