మనస్థాపంతో గృహిణి ఆత్మహత్య
బతుకమ్మ, కోటగిరి : అబార్షన్ అయిందనే మనోవేదనతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై సునీల్ తెలిపిన కథనం ప్రకారం.. పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన మచ్కరి సుధాకర్ అనే వ్యక్తికి నాలుగు సంవత్సరాల క్రితం ముఖేడ్ తాలూకా ఓరల్ గ్రామానికి చెందిన మహాదేవితో వివాహం కాగా చాలా రోజుల తర్వాత మహాదేవి గర్భం దాల్చగా నాలుగు నెలల గర్భస్థ శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అబార్షన్...