24 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్హులైన నిరు పేదలకు వెంటనే ఇండ్లు కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అర్హులైన నిరుపేదలకు పారదర్శక విధానంలో వెంటనే ఇండ్లు కేటాయించాలని, లేకపోతే కమ్యూనిస్టు పార్టీగా ప్రజా ఉద్యమాలను చేపట్టి ఆ ఇండ్లను పేద ప్రజలకు అందించే దిశగా పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల రెవల్షనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికీ అర్హులైన పేదలకు అందించకుండా నిరుపయోగంగా వదిలేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని, అనేక భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక చోట్ల కిటికీలు, డోర్లు, స్విచ్ బోర్డులు, నీటి పైపులు, బేసిన్లు తదితర సామగ్రి దొంగిలించబడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల కష్టార్జిత ధనంతో నిర్మించిన ఇండ్లను ఇలా పాడైపోయేలా వదిలేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది మంది పేద ప్రజలు ఇంకా కిరాయి ఇండ్లలో జీవిస్తూ అధిక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. నిరుపయోగంగా ఉన్న ఇండ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేదల గృహ హక్కు కోసం ఆర్ఎస్ పి పార్టీ ఎప్పటికీ రాజీ పడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిట్ల నరేష్, గోపాల్ సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article