తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు
టోల్ ఫ్రీనంబర్ ఏర్పాటు
హైదరాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్లు నిజమైన పేదలకు కేటాయించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చిన ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఇందు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని, ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చన్నారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను మంత్రి పొంగులేటి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదే అన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి మంత్రి ఆర్డర్ కాపీలు ఇచ్చి మాట్లాడారు. తప్పు జరిగిందని చెబితే చాలు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
