భీమ్ గల్,బతుకమ్మ :
భీమ్ గల్ మాజీ ఎంపీపీ,మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత భర్త కన్నె సురేందర్ కాంగ్రెస్ పార్టిలో చేరారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సురేందర్, మూడేడ్ల జితేందర్లకు సుదర్శన్ రెడ్డి పార్టీ కండ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీపీగా,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పని చేసిన కన్నె సురేందర్, అట్లాగే గతంలో భీమ్ గల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పని చేసిన మూడేడ్ల జితేందర్ లు తిరిగి శుక్రవారం సొంత గూటికి చేరారు.వీరిరువూరు బీయర్ఎస్ లో చేరిన అనంతరం కన్నె సురేందర్ భీమ్ గల్ మున్సిపల్ చైర్మన్ గా పదవినేనుభవించి నప్పటికీ,మూడేడ్ల జితేందర్ బీయర్ఎస్ లో ఏ పదవి ఆశించకుండా సామాన్య కార్యకర్తగానే ఉన్నారు. దాంతో ఆయనకు సముచిత స్థానం లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమం లో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీసాల సుధాకర్ తదితరులు ఉన్నారు.
