గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం

0 15,267

బతుకమ్మ, భిక్కనూరు: అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా భిక్కనూరు గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ యూత్ నాయకులు శ్రీరామ్ వెంకటేష్ శాలువాతో గురువారం సత్కరించారు. ప్రపంచ మనుగడకు మూలం శ్రమశక్తి వెలకట్టలేని కార్మిక శ్రమను అందరం గౌరవిద్దాం రాత్రింబవళ్లు శ్రమించే కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యంని వారు తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షం గా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అందే దయాకర్ రెడ్డి, తాటిపాముల లింబాద్రి, నరసింహారెడ్డి ,మోహన్ రెడ్డి, కల్లూరు సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.