నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ కోటగల్లి మాల సంఘం ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా మెరిట్ విద్యార్థినిలను సన్మానించారు. ఆదివారం విడుదల చేసిన ఇంటర్మిడియట్ ఫలితాల్లో బైపీసీ లో 962 మార్కులు సంపాదించిన దళిత అమ్మాయి నల్ల భవాని, 957 మార్కులు సాధించిన గైని వైష్ణవి ని కోటగల్లి మాల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
