జూనియర్ అసిస్టెంట్ కొండపల్లి గాయత్రికి సన్మానం

0 3,656

కామారెడ్డి, బతుకమ్మ : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ తుది ఫలితాల్లో విజేతగా నిలిచి, జిలా అధికారి ఉద్యోగానికి ఎంపికయిన జిల్లా బీసీ సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ కొండపల్లి గాయత్రిని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు చందర్ నాయక్, విక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, ఎస్సీ సంక్షేమ శాఖ బుధవారం అభినందించి, సన్మానించారు. గ్రూప్ వన్ ఉద్యోగానికి ఎంపికైన గాయత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఆమెను ప్రశంసించి, భవిష్యత్తులో నిర్వహించబోయే బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. చిన్న వయస్సులో జిల్లా అధికారిగా ఎంపిక కావడం, భవిష్యత్తులో కన్ఫర్మ్ ఐఏఎస్ కానుండటం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న గాయత్రికి గురువులా అండగా నిలిచి, మార్గ నిర్దేశం చేసి, విజయం సాధించేలా చేసిన తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగి రేవంత్ ను సైతం జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా  అభినందించారు. జర్నలిస్టుల  రాష్ట్ర రక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య, బిజెపి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు ఆమెను సన్మానించి, అభినందించారు. గాయత్రి విజయంలో అండగా నిలిచిన రేవంత్ కృషిని కొనియాడారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు సైతం గాయత్రికి సన్మానం చేశారు.

Leave A Reply

Your email address will not be published.