నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన కూతురును ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన తండ్రిని కత్తులో పొడిచిన ఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని ఆరో టౌన్ పరిధిలోని అక్బర్‌నగర్ లో షేక్ గౌస్ నివాసం ఉంటున్నాడు. షేక్‌గౌస్ కూతురిని అదే ప్రాంతానికి చెందిని ఇద్దరు యువకులు సోహైల్, పర్వేజ్ వేధిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న షేక్ గౌస్ తన భార్య ఫర్హానాతో కలిసి సోహైల్ ఇంటికి వెళ్లి నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు కత్తితో షేక్గౌస్పై దాడి చేశారు. అనంతరం భార్య ఫర్హానాపై దాడి చేశారు. విషయం తెలుకున్న నార్త్ రూరల్ సీఐ సురేష్‌బాబు, 6వ టౌన్ ఎస్సై వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న షేక్గౌస్ను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
