నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పంచాయితీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన గడ్డం భాస్కర్ ని తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్, జమాత్ – ఏ -ఇస్లాం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని శనివారం జిల్లా పరిషత్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా టియుపిఏ అధ్యక్షులు రెవ.వి.జెకర్య ఆనంద్ మాట్లాడుతూ గతంలో మైనార్టీలో వీరి సేవలు మరువలేనివని అందరితో కలిసిపోయి చక్కని మంచి సేవలు అందించారు అని కొనియారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ కార్యవర్గ సభ్యుడు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు దేశానికి రాష్ట్రానికి అభివృద్ధికి అందించే సేవలు ఎంతో ప్రాముఖ్యమని, అప్పుడే మన రాష్ట్రం జిల్లాలు అభివృద్ధి చెందుతాయి అని అన్నారు. అలాగే వీరు గత కాలంలో మైనార్టీలో అందించిన సేవలు మరువలేనివి అని అభినందించారు. టీయూపీఏ మాజీ అధ్యక్షులు రెవ. బి.జోసఫ్ మాట్లాడుతూ భాస్కర్ యొక్క సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎలీషా, జాన్ మార్క్, రవి ఆనంద్, సన్నీ జాన్సన్, కాసిమ్ విజయ్, కరుణాకర్, బాలయ్య, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

