ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్న జవాన్‌కు సన్మానం
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని కన్నారెడ్డి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మర్కంటి ప్రశాంత్ ను గురువారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని శత్రు సైన్యాన్ని మట్టుబెట్టి, భారతదేశానికి విజయాన్ని అందించడంలో తన వంతు కీలకపాత్ర పోషించిన ఆయన ధైర్యసాహసాలను కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో దేశం మొత్తం భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ...