24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం .. నేరం ఎవరు చేసిన శిక్ష తప్పదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

 నిజామాబాద్, బతుకమ్మ :

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు… తనను అరెస్టు చేస్తే మరింత కష్టపడి పనిచేస్తానని హరీష్ రావు కామెంట్స్… ఇటీవల మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సూప్రీం కోర్టు లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిజామాబాద్ డిసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం . గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నేరం  ఎవరు చేసినా శిక్ష తప్పదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడు .అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాగా పని చేస్తున్నారు అని కితాబు ఇచ్చారు. ఇటీవల రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో లక్షల 70 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఇందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. పదేళ్ల విధ్వంసం నుండి వికాసం దిశగా ముందుకు వెళ్తున్నాం  అని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తున్నాము  అని గుర్తు చేశారు. రాష్ట్రం మొత్తంలో అత్యధిక కాంగ్రెస్ సర్పంచులు నిజామాబాద్ జిల్లాలో గెలుపొందారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతాం అన్నారు. ఫిరాయింపుల అంశం స్పీకర్ ఫరీదిలో ఉంది,స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించటానికి  ఏమీ లేదు అన్నారు.  దానం నాగేందర్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం అని టెక్నికల్ గా పార్టీ మారలేదు అని చెప్తున్నారు . కెసిఆర్ ఉదాసీనత వల్ల నీటి కేటాయింపులు తెలంగాణకు అన్యాయం జరిగింది .కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ లు పారదర్శకంగా ఉన్నాయి .90 శాతం జీఓ లు అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టామని  పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో ఒక్క జీవో కూడా బహిర్గతం చేయలేదు  అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, సహకార సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

hone tapping is a very serious crime. Whoever commits the crime must be punished

More articles

Latest article