… రుద్రూర్ లో కృతజ్ఞత సభ లో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి
రుద్రూర్, బతుకమ్మ:
కాంగ్రెస్ పార్టీ కోసం పట్టువదలని నాయకుడిగా, కాంగ్రెస్ కు చిరునామా ఇందూరు చంద్రశేఖర్ అని బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా ఇందూరు సునీత చంద్రశేఖర్ మూడవ సారి ఎన్నికైన సందర్భంగా రుద్రూర్ గ్రామంలో శేఖర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు మాట్లాడుతూ.. రుద్రూర్ సర్పంచ్ గా ఇందూరు సునీత – ఇందూరు చంద్రశేఖర్ ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించినందుకు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణంగా భావించే, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి ఇందూరు చంద్రశేఖర్ అని కొనియాడారు. ప్రజలు పార్టీ చూసి ఓటు వేయలేదని వ్యక్తిని చూసి ఓటు వేశారని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అండగా ఉన్నారని వారు పేర్కొన్నారు.

అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రుద్రూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని అన్నారు. నిరుపేదలకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారని ఆయన సభాముఖంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా గ్రామస్తుల సమక్షంలో అసలైన నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత- చంద్రశేఖర్ ను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ జిల్లా మేయర్ సుజాత, నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్ సంజయ్, డిసిసి నూతన అధ్యక్షుడు కాట్పల్లి నగేష్ రెడ్డి, వివిధ మండలాల నాయకులు, పార్టీ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
