25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

హూన్సా లో ఘనంగా హోలీ సంబురాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉదయం రంగుల సందడి

 

. . . మధ్యాహ్నం కుస్తీ పోటీలు

 

. . . సాయంత్రం పిడిగుద్దులాట

 

బోధన్, బతుకమ్మ

 

సాలుర మండలం లోని  హున్సా గ్రామంలో గత దశాబ్దాలుగా ఆనంద హోలీ సందర్భంగా నిర్వహించే పిడిగుద్దులాట  ఈసారి చంద్రగ్రహణం కారణంగా మంగళవారం బదులుగా బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఉదయం గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా రంగులతో హోలీ ఆడుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా యువకులు, మహిళలు, వృద్ధులు పండుగను ఆనందంగా జరుపుకున్నారు. మధ్యాహ్నం గ్రామంలో సంప్రదాయ కుస్తీ పోటీలను నిర్వహించారు. యువకులు శక్తి ప్రదర్శన చేస్తూ పోటీల్లో పాల్గొనగా, గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహపరిచారు. సాయంత్రం గ్రామ నడిబొడ్డులోని హనుమాన్ ఆలయం సమీపంలో పిడిగుద్దులాటను నిర్వహించారు. ప్రత్యేకంగా తాడు కట్టి రెండు బృందాలుగా విడిపోయిన యువకులు ఒక చేత్తో తాడు పట్టుకుని మరో చేత్తో పిడిగుద్దులు కురిపించడం ఈ ఆట ప్రత్యేకతగా నిలిచింది. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుండటం విశేషం. గ్రామంలోని అన్ని కులాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం హోలీ ఉత్సవాలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సంప్రదాయం, ఐక్యత, ఉత్సాహం కలగలిపిన హున్సా హోలీ వేడుకలు గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపాయి.

 

Holi celebrations in full swing in Hunsa

 

More articles

Latest article