23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

టీసీ ఇచ్చి పంపించిన హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : స్కూల్​కు ఫోన్​ తీసుకొచ్చాడనే  కారణంగా విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించిన హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని  బంజార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బంజారా సేవా సంఘం నాయకులు గురువారం తెలిపిన వివరాలు..  ధర్పల్లి మండలంలోని దుబ్బాక  జిల్లా పరిషత్​ పాఠశాలలో గతనెల 20 తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు రామ్ వత్ చరణ్ అనే విద్యార్థి స్కూల్​కు ఫోన్​ తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన హెచ్​ఎం సదరు విద్యార్థిని కొట్టి.. దూషించిందని  సంఘం నాయకులు ఆరోపించారు.  అలాగే విద్యార్థికి టీసీ ఇచ్చి.. తల్లిదండ్రులను పోలీస్​స్టేషన్​ పిలిపించారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం సుమారు 30 మంది సల్పబండ తండావాసులు పాఠశాలకు వచ్చి హెచ్​ఎం వ్యవహర శైలిని ఖండించారు. పాఠశాలకు తరలివచ్చిన వారిలో మాజీ సర్పంచ్​ శర్మాన్​ నాయక్​, తండానాయక్​, శంకర్​ నాయక్​, కారోబార్​ బాద్యానాయక్​, అమనార్​, రమేష్​, గణేష్​ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article