టీసీ ఇచ్చి పంపించిన హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, బతుకమ్మ : స్కూల్కు ఫోన్ తీసుకొచ్చాడనే కారణంగా విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించిన హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని బంజార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బంజారా సేవా సంఘం నాయకులు గురువారం తెలిపిన వివరాలు.. ధర్పల్లి మండలంలోని దుబ్బాక జిల్లా పరిషత్ పాఠశాలలో గతనెల 20 తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు రామ్ వత్ చరణ్ అనే విద్యార్థి స్కూల్కు ఫోన్ తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన హెచ్ఎం సదరు విద్యార్థిని కొట్టి.. దూషించిందని సంఘం నాయకులు ఆరోపించారు. ...