కోటగిరి, బతుకమ్మ: స్థానిక ఎన్నికలు నగారా మోగిన వెంటనే కోటగిరి మండల కేంద్రంలో రాజకీయాలు వేడెక్కాయి. బోగస్ బోనస్ వ్యవహారంలో సుమారు రూ. 70 లక్షల అవినీతి జరిగిన విషయం అందరికి తెలిసిందే అయితే తాజాగా ఉమ్మడి మండలానికి కీలక నేత పేరును బీఆర్ఎస్ నాయకులు బట్ట బయలు చేశారు. కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవి కుమార్ మాట్లాడుతూ.. బోగస్ బోనస్ వ్యవహారం బహిర్గతమైన ఆరు నెలలు కావస్తున్నా విచారణ అధికారి అంబర్ సింగ్ మాత్రం నిజా నిజాలను బహిర్గతం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కోటగిరి ఉమ్మడి మండలానికి చెందిన మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్, అతని భార్య, కుమార్తె, తమ్ముడి భార్యపై మొత్తం రూ. 4,58, 400 బోనస్ రూపంలో డబ్బులు పడ్డాయని తెలిపారు. ఎన్ని ఎకరాలలో ఎక్కడ వ్యవసాయం చేశారు తెలపాలని సూచించారు. విచారణ అధికారి అంబర్ సింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కుమ్మక్కై భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నారని ఆరోపించారు. వెంటనే విచారణ అధికారి అంబర్ సింగ్ ను మార్చాలని డిమాండ్ చేశారు.. బోగస్ బోనస్ వ్యవహారంలో కోటగిరి మండల కేంద్రానికి చెందిన రైస్ మిల్లర్స్. వారికి అత్యంత సన్నితులైన ప్రజా ప్రతినిధుల కీలకంగా ఉన్నాయని తెలిపారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకొని అవినీతి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోని సొత్తును రికవరీ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్, కిషన్, గజేందర్,సమీర్, అరవింద్, గంగా ప్రసాద్ గౌడ్, గౌతమ్, కప్ప సంతోష్,నజీర్,అరుణ్ గౌడ్,విజయ్, తదితరులు పాల్గొన్నారు.
