24 C
Hyderabad
Sunday, August 2, 2026

అదనపు కట్నం తేలేదని హెచ్ఐవీ ఇంజెక్షన్ చేశారు

Must read

📰 Generate e-Paper Clip

దారుణానికి పాల్పడిన అత్తమామలు

యూపీలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : అదనపు కట్నం ఇవ్వలేదని తమ కోడలిపై ఓ కుటుంబం దారుణానికి ఒడిగట్టారు. హెచ్ఐవీ బాధితుడికి ఇంజెక్షన్ను తమ కోడలికి బలవంతంగా ఇచ్చారు. దీంతో ఆమె హెచ్ఐవీ బారిన పడింది. ఈసంఘటన యూపీలో ఆలస్యంగా వెలుగు చూసింది. యూపీలోని సహరన్ పూర్ కు చెందిన యువతికి ఉత్తరాఖండ్ లో హరిద్వార్ కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్ అనే యువకుడితో 2023 ఫిబ్రవరి 15 న వివాహమైంది. దాదాపు రూ.15 లక్షల కట్నంతో పాటు కారు బహుమతి గా ఇచ్చారు. పెళ్లయిన మరుసటి రోజు నుంచే మరో పది లక్షలు అదనపు కట్నం తేవాలని అత్తింటివారు వేధింపులకు గురిచేశారు. గ్రామంలో పెద్ద మనుషుల  సమక్షంలో పంచాయతీ నిర్వహించి యువతిని తిరిగి అత్తింటికి పంపారు. ఈక్రమంలో కుమారుడికి మరో పెళ్లి చేయడానికి  కోడలిని హత్య చేసేందుకు అత్తమామలు కుట్ర చేశారు. ఇందులో భాగంగా 2024 మే నెలల హెచ్ ఐవీ వైరస్ తో కలుషితమైన ఇంజెక్షన్లు ఆమెకు బలవంతంగా ఎక్కించారు. కొద్దికాలానికి యువతి ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు చేయడా హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి తండ్రి కోర్టుకు ఎక్కారు. కోర్టు ఆదేశాలతో భర్త, అత్త ఆడపడుచు, ఆమె భర్తలపై కేసు నమోదు చేశామని , దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

More articles

Latest article