27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఖైదీలకు హెచ్ఐవి, హెపటైటిస్, క్షయ నిర్ధారణ పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సెంట్రల్ జైలు లో దాదాపు 640 మంది ఖైదీలకు హెచ్ఐవీ, హెపటైటిస్, టీబీ పరీక్షలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్, డెంటల్, గైనిక్, గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టర్ బి రాజశ్రీ, జిల్లా టిబి నియంత్రణ అధికారి & పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ డాక్టర్ దేవి నాగేశ్వరి,  ఎన్విహెచ్సీపీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా టిబి నియంత్రణ సిబ్బంది, మొబైల్ ఐ సి టి సి సిబ్బంది, జిల్లా వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article