28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జింక్ సల్ఫర్ పోషకాలతో అధిక దిగుబడులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు08: వరి పంటలో జింక్ సల్ఫర్ పోషకలతో కూడిన మందులు వాడడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ సౌత్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ రెడ్డి రైతులకు సూచించారు. గురువారం మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలోని తీగల కిషన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వరి పంట పొలాలను పరిశీలించారు.

సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఇమారా మందును వాడడం వల్ల వరి పంటను ఆశించే చీడపీడల నివారణ, పంట ఎదుగుదల, ఎక్కువ పిలుకల శాతం, భూమి లోపల ఉన్న అన్ని పోషకాలు సమర్ధవంతంగా పనిచేస్తాయని దానివల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ సౌత్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ రెడ్డి ,జిల్లా మేనేజర్ సుమంత్ రెడ్డి, రీజినల్ మేనేజర్ విజయకుమార్ మార్కెటింగ్ మేనేజర్ మధుకర్, గ్రామ రైతులు కోమనపల్లి లక్ష్మణ్ , చిన్న గంగారం, మల్లెం గంగారెడ్డి , కడారి రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article