– ఎమ్మెల్యే పైడి రాకేష్ ను ఆర్మూర్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
– పెద్ద ఎత్తున పోలీస్ బలగాల మోహరింపు
– కామారెడ్డి ఎమ్మెల్యే కాంపు క్యాంపు కార్యాలయానికి తరలింపు
బతుకమ్మ, భిక్కనూరు:
ఆర్మూర్లో జరిగిన సంఘటన కారణంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆర్మూర్ వెళ్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. ఆర్మూర్ వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకొని ఆర్మూరు వెళ్ళవద్దని సూచించగా తాను ఆర్మూర్ వెళ్లి తీరుతానని పోలీసులతో తెల్చి చెప్పారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా తాను కారులో నుంచి క్రిందకు దిగలేదు. దాదాపు గంటన్నర సమయం వరకు కారులోనే ఎమ్మెల్యే ఉండగా టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోగా స్థానిక బిజెపి నాయకులు సైతం చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడగా ఆర్మూర్ కు వెళ్ళవద్దని ఆదేశించడంతో తాను ఆర్మూరు వెళ్ళనని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తానని సూచించడంతో పోలీస్ ఎస్కార్ట్ తో ఎమ్మెల్యేను కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు తీసుకెళ్లారు.

