27.3 C
Hyderabad
Friday, July 31, 2026

రూ.5 లక్షలు కట్టాలని కేఏ పాల్ కు హైకోర్టు సూచన

Must read

📰 Generate e-Paper Clip

అమరావతి, బతుకమ్మ : పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు బుధవారం విచారించింది. ఆ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిల్ లో పాల్ కోరారు. ఆ వ్యాజ్యాన్ని ఆయన సదుద్దేశంతోనే దాఖలు చేశారన్న రుజువు కోసం కోర్టు రిజిస్ట్రీ వద్ద రూ.5లక్షలు కట్టాలని సూచించింది. ఆ సొమ్ము చెల్లించిన తర్వాతే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

More articles

Latest article