25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హీమోఫీలియా పై అవగాహన ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

 ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్  ప్రభుత్వ మెడికల్ కాలేజీ / ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం హీమోఫీలియా పై అవగాహన ర్యాలీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ప్రారంభమై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫ్రో. డా. కృష్ణ మోహన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్, జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ ప్రో. నాగ మోహన్ లు ర్యాలీ సందర్భంగా ప్రజలకు హీమోఫీలియా వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ, ముందస్తు గుర్తింపు, సరైన నిర్ధారణ తగిన చికిత్స ద్వారా సమస్యలను నివారించవచ్చని తెలియజేశారు. హీమోఫీలియా బాధితులు సమయానికి వైద్య సేవలు పొందడం ఎంతో ముఖ్యమని, సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా తీవ్ర సమస్యలు నివారించవచ్చని వైద్యులు పేర్కొన్నారు.  నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హీమోఫీలియా కు వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా. రాములు , వైస్ ప్రిన్సిపాల్ డా. తిరుపతి రావు , డా. కిషోర్ కుమార్ , హీమోఫీలియా నోడల్ ఆఫీసర్ డా. పవన్ అలాగే మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

Hemophilia Awareness Rally

More articles

Latest article