ఆచన్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం
బోధన్, బతుకమ్మ : సాలూర మండలంలోని ఆచన్‌పల్లి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ శాఖ ఆధ్వర్యంలో వరద ప్రభావిత గ్రామాలకు సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన బోధన్, సాలూర పరిసర గ్రామాలైన మందర్నా, హున్సా, ఖాజాపూర్‌లలో క్లబ్ సభ్యులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో కూడిన 100 ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇంటర్నేషనల్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ బసవేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్ సభ్యులు మాట్లాడుతూ...