. . . మే 15న మద్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ
హైదరాబాద్, బతుకమ్మ :
పోక్సో కేసులు పోలీసులు అరెస్టు చేయకుండా నిలువరించేందుకు దాఖలు చేసి బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ ను హై కోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. అయితే మద్యంతర బెయిల్ పిటిషన్ ను ఈ నెల 15న శుక్రవారం విచారణ చేపడుతామని పేర్కొంది. ఈ నెల 8న కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పీఎస్ లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ హై కోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ కేసు హై కోర్టులో విచారణ జరిగింది. భగీరథ్ తరపున ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన పోక్సో చట్టం కేసులోని సెక్షన్ పరిధిలోకి పిటిషనర్ రారని వాదించారు. బాధితురాలు మైనర్ కాదని, తప్పుడు రికార్డులతో వయస్సు తగ్గించి పోక్సో కేసు పెటించారని ఆరోపించారు. పోక్సో కేసులో భగీరథ్ పై తప్పుడు ఆరోపణలు చేశారని, తన క్లయింట్ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ఆ మొత్తం చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని కోర్టుకు తెలిపారు. బాధితుల బెదిరింపులకు లొంగకుండా కరీం నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు జరిగాక అదనపు సెక్షన్లు మార్చడం అనుమానాలకు దారితీస్తుందని, ఇది కుట్ర పూరితంగా జరిగిందని భావించాల్సి వస్తుందని భగీరథ్ లాయర్ వాదించారు. బాధితురాలి స్టెట్మెంట్ రికార్డు చేసి, వాస్తవాలను పరిగణలోకి తీసుకుని సెక్షన్ లు మార్చడం జరిగిందని డిఫెన్స్ వారు కౌంటర్ ఇచ్చారు. ఇరు వర్గాల వాదనలను విన్న హై కోర్టు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ ను వారం రోజులకు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ వచ్చే వరకు పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని భగీరథ్ తరపు లాయర్ వాదనలు వినిపించగా.. మద్యంతర బెయిల్ పై శుక్రవారం విచారణ చేపడుతామని హై కోర్టు స్పష్టం చేసింది…
