29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

లింగ నిర్ధారణ పరీక్షలపై వైద్యారోగ్య శాఖ సీరియస్

Must read

📰 Generate e-Paper Clip

  • సమన్విత ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు జారీ

 

కామారెడ్డి, బతుకమ్మ : లింగ నిర్ధారణ పరీక్షలపై కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని సమన్విత ఆసుపత్రికి బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత రెండేళ్లుగా సమన్విత ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమ కార్యాకలాపాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు హెచ్చరికాలు జారీ చేసినా పట్టించుకోలేదు. గతంలో కౌసల్య ఆసుప్రతి పేరిట లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భ విచిత్తి ప్రక్రియలు నిర్వహిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు వైద్యారోగ్య శాఖ గతంలో ఎన్నో సార్లు నోటీసులు జారీ చేసీ సీజ్ చేశారు. అయితే యాజమాన్యం ఆ ఆసుపత్రి పేరును సమన్విత ఆసుపత్రి గా మార్చి తిరిగి ప్రారంభించారు. ధనార్జనే ధ్యేయంగా తిరిగి అవే తప్పులు చేయడం ప్రారంభించారు. యథేచ్చగా స్కానింగ్ లు, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భ విచ్చిత్తి ప్రక్రియలు చేస్తున్నారు.  అలాగే జూలై 2024 లో ఈ ఆసుపత్రి యాజమాన్యం ఒక ఆడ శిశు విక్రయం  కేసులో కూడా పాలు పంచుకున్నారు. ఆసుపత్రి మేనేజ్ మెంట్  అయిన  విట్టo నడిపి సిద్ధిరాములు డాక్టర్ విట్టo ప్రవీణ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. కానీ ఆసుపత్రి యాజమాన్యం నోటీసు ఇచ్చిన తర్వాత తగినంత సమయం ఇవ్వకుండా ఆసుపత్రి సీజ్ చేయడం అన్యాయం అని హైకోర్టులో వైద్య శాఖ పైన కేసు వేశారు.  హైకోర్టు వైద్యశాఖ సీజు చేసిన తీరుకుగాను మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తగిన నిబంధనల ప్రకారం శోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. హై కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గత ఆరు నెలల నుండి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ అక్రమ కార్యకలాపాలు  నిర్వహిస్తున్న సమన్విత హాస్పిటల్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అనేక రకాల ప్రక్రియలు చేపట్టారు.  ఇదే క్రమంలో హాస్పిటల్ యాజమాన్యం స్కానింగ్ మిషన్లు తీసుకుని గృహాలలో స్కానింగ్ చేయడానికి వెళుతున్న విషయాలు గుర్తించి గృహంలో ఉంచినటువంటి స్కానింగ్ మిషన్ ను, వాహనం లో తీసుకునేళ్తున్న స్కానింగ్ మిషన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని సీజ్ చేశారు. సీజ్ చేసి ఈ స్కానింగ్ మెషిన్లు నిర్వహిస్తున్న సమన్విత హాస్పిటల్ యాజమాన్యం పైన కామారెడ్డి జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు.  ఈ విధంగా సమన్విత హాస్పిటల్ పైన పి.సి.పి.ఎన్. డీ.టి.చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడానికి జిల్లా వైద్య శాఖ నిర్విరామంగా  శ్రమించి అనేక రకాల సాక్ష్యాలు సేకరించి కేసు ఫైలు చేసింది. ఈ సమన్విత హాస్పిటల్ యాజమాన్యం జిల్లా వైద్య శాఖ పైన హైకోర్టులో రిట్ పిటిషన్  వేసినందున ఆ రిట్ పిటిషన్ ను సవాలు చేస్తూ హైకోర్టులో  వైద్య శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. గత ఆరు నెలల నుండి ఈ రిట్ పిటిషన్  పైన హైకోర్టులో విచారణ జరిగింది. వైద్యశాఖ తరఫున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తగిన సాక్ష్యాలు కావలసిన డాక్యుమెంట్లు , ఆధారాలు సేకరించి పకడ్బందీగా కౌంటర్ ఆఫీడవిట్ హైకోర్టులో వేశారు. హైకోర్టు జిల్లా వైద్యశాఖ సమర్పించిన సాక్షాధారాలు, షో కాజ్  నోటీస్ డాక్యుమెంట్లు ,ఇతర ఆధారాలు  తీసుకుని, సమన్విత ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అక్రమ కార్యకలాపాలు చట్ట విరుద్ధమైన చర్యలు భ్రూణ  హత్యలు,  గర్భస్థ పిండ లింగ  నిర్ధారణ పరీక్షలు , ఆడ శిశు విక్రయం  తదితర సంఘటనల వివరాలను సాక్షాధారాలతో  హైకోర్టులో సమర్పించింది. ఈ సాక్షాధారాలు సేకరించడానికి వైద్య శాఖ అధికారులు ఆరు నెలల నుండి రాత్రింబవళ్లు శ్రమించి పకడ్బందీ  చర్యలతో తగిన డాక్యుమెంట్లు హైకోర్టులో సమర్పించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం వలన హైకోర్టు నిజనిర్ధారణ చేసి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా చాలా కాలంగా చట్ట విరుద్ధమైన అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమన్విత ఆసుపత్రి సర్వీసులు కొనసాగడానికి వీలులేదని, ఈ ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు, కిత్సలు నిర్ధారణ పరీక్షలు స్కానింగ్ పరీక్షలు నిర్వహించడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బుధవారం సమన్విత ఆసుపత్రికి వెళ్లి హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి తగిన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ  ప్రొసీడింగ్స్ పత్రాలను ఆసుపత్రి యాజమాన్యం తీసుకోవడానికి నిరాకరించింది.  దీంతో కోర్టు ఆదేశాలను, ప్రొసీడింగ్ పత్రాలను సమన్విత ఆసుపత్రి భవనం ద్వారాలకు అతికించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సమన్విత ఆసుపత్రి వారు ఏవైనా కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. ఈ సమన్విత ఆసుపత్రి యాజమాన్యం లో ఒకరైన డా.ప్రవీణ్ కుమార్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రాష్ట్ర సంచాలకుల కార్యాలయానికి సరెండర్ చేయగా అతిడిని క్రమశిక్షణ చర్యల పైన కొమరం భీం అసిఫాబాద్ కు బదిలీ చేశారు.

Health Department serious about gender determination tests

More articles

Latest article