నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆరోగ్య అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్ హజరయ్యారు. కేర్ కళాశాలకు చెందిన బీజడ్సీ ఉర్దూ మీడియం విద్యార్థుల చేత అధ్యాపకురాలు ఆస్మ ఫిర్దౌస్ ఏర్పాటు చేసిన “ఆరోగ్య అవగాహన సదస్సు” ను సందర్శించి అభినందించారు. వివిధ రుగ్మతలు రావాడానికి గల కారణాలను, వాటి నివారణ, నిరోధక చర్యలను విద్యార్థులు క్లుప్తంగా వివరించారు. ఆస్మ ఫిర్దౌస్ లాంటి అధ్యాపకులు ఉంటే అద్భుతమైన విద్యార్థులను తయారు చేయవచ్చని చంద్రశేఖర్ అన్నారు. కళాశాల విద్యార్థులు కూడ ఈ ప్రదర్శనను చూసి చాలా అవగాహన పొందడం జరిగింది అని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తో పాటు ప్రిన్సిపాల్ బాలకృష్ణ ను ఆచార్య గంట చంద్రశేఖర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, నరేష్, సందేష్, సందీప్, కొయ్యాడ శంకర్, విజయ్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

