మోర్తాడ్, బతుకమ్మ: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శేట్ పల్లీ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నృత్యాలతో అలరించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ సేవలు మరువలేనివని ప్రతి విద్యార్థి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులందర్నీ పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

