Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2025, 6:22 pm Posted by : ramakrishna

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

మోర్తాడ్, బతుకమ్మ: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల శేట్ పల్లీ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ  నృత్యాలతో అలరించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య మాట్లాడుతూ  సర్వేపల్లి రాధాకృష్ణ  సేవలు మరువలేనివని ప్రతి విద్యార్థి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు  ఉపాధ్యాయులందర్నీ పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Happy Teacher's Day