26.2 C
Hyderabad

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల :  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని  ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల విద్యార్థులు గురువు గొప్పతనాన్ని గూర్చి చక్కగా ఉపన్యాసాలు పాటలతో వివరించారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు గురువుల గొప్పతనాన్ని గూర్చి విద్యార్థులకు చాలా చక్కగా పాటల రూపంలో కథల రూపంలో వివరించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ మాట్లాడుతూ, గురువుల గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఎవరైతే గురువులను గౌరవిస్తారో, గురువులు చెప్పిన మాటలను తూ.చ తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్లు భవిష్యత్తులో గొప్పవాళ్లుగా ఎదుగుతారని తెలియజేసారు. విద్యార్థులు నిరంతరం గురువుల చెప్పే పాఠాలను చక్కగా వినాలని, ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని తెలిపాడు. కార్యక్రమంలో పాఠశాల తరఫున ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునీరుద్దీన్, ప్రసాద్,శ్రీనివాస్,విజయ్, రాజ నర్సయ్య ప్రవీణ్ శర్మ,రాజేందర్,గంగమోహన్,ట్వింకిల్,గంగాధర్, సమత,జ్యోతి,కోమలి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article