ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

బతుకమ్మ, ఏర్గట్ల :  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని  ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల విద్యార్థులు గురువు గొప్పతనాన్ని గూర్చి చక్కగా ఉపన్యాసాలు పాటలతో వివరించారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు గురువుల గొప్పతనాన్ని గూర్చి విద్యార్థులకు చాలా చక్కగా పాటల రూపంలో కథల రూపంలో వివరించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ మాట్లాడుతూ, గురువుల గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఎవరైతే గురువులను గౌరవిస్తారో, గురువులు చెప్పిన మాటలను తూ.చ తప్పకుండా ఎవరైతే...