బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో శనివారం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సందర్బంగా అధ్యాపక బృందం సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జలపతి, నిజామాబాదు జిల్లా ఎస్సీ, ఎస్టీ తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి పర్శరాములు, టీజీజేఎల్ఏ జిల్లా అధ్యక్షులు జి లక్ష్మినారాయణ, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
