బతుకమ్మ,మోర్తాడ్: ఉన్నత విద్యారంగంలో ముఖ్యంగా డిగ్రీ అడ్మిషన్లలో దోస్త్ ద్వారా ఒక చిన్న దరఖాస్తు ద్వారా రాష్ట్రంలో ఏ కళాశాలలోనైనా అడ్మిషన్ పొంది అవకాశం ఉందని అన్నారు. మోర్తాడ్ లోని డిగ్రీ కళాశాలలో శనివారం తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రీజేష్ కుమార్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో 2025 డైరీని ప్రిన్సిపాల్ పెద్దన్న సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బ్రీజేష్ కుమార్ ను ఘనంగా శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో భీంగల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుమలత వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి అకాడమిక్ కన్సల్టెంట్ దశరథ్ అధ్యాపకులు రవీందర్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
