29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆస్తి పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి

Must read

📰 Generate e-Paper Clip

  • మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణ ప్రజలు తమ తమ ఆస్తి పన్నులను నిర్ణత సమయంలో కట్టి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కోరారు. శనివారం పట్టణంలోపన్నుల వసూళ్ళ బృందాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా స్థానిక వెంకట రమణ ఫర్టిలైజర్ ట్రేడ్ లైసెన్స్ ను రినివల్ చేసి ప్రోప్రేటర్ పల్లికొండ భూపతి కి అందజేశారు. అన్ని వార్డులల్లో ఉన్న బకాయిలను వసుల్ చేశారు. ఆస్తి పన్ను కట్టనిచో చట్టం 2019 ప్రకారం రెండు నోటీసులు జారీ చేసి తదుపరి చట్ట ప్రకారం చర్యలు చేపడ్డం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంట మేనేజర్ నరేందర్, ఆర్.ఐ రాజేశ్వర్, వార్డు ఆఫీసర్, బిల్లు కలెక్టర్, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article